65
ముద్ర,తెలంగాణ:- నైరుతి రుతుపవనాలు 24 గంటల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సౌత్, వెస్ట్ జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. వికారాబాద్, నారాయణ పేట, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, రంగారెడ్డిజిల్లాల్లో మోస్తరు నుంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఏర్పాటు చేసింది. జీహెచ్‌సీతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో సైతం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.ప్రస్తుత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్‌సీ అధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.