అమరావతి, ఈవార్తలు : గాయపడ్డ పులికే తెలుసు.. ఆ బాధేంటో. గత ఐదేళ్లుగా తాను అనుభవించిన కష్టాల్లోంచి పుట్టుకొచ్చిన కొత్త ఆలోచనలు.. అందరినీ కలుపుకొని పోయే తత్వం.. గతంలో చూసిన చంద్రబాబుకు భిన్నంగా, సరికొత్తగా కనిపిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పాలనలో చంద్రబాబు తన నీడను కూడా నమ్మరు అని అనుకునేవారు. తాను చేయాల్సిందే అనేవారు. కానీ, ఈ సారి చంద్రబాబు.. వేరే లెవెల్. ఆయన నిర్ణయాలు కూడా వేరే లెవెల్ అన్నట్లు ఉంటున్నాయి. గతంలో ఓ సామాజిక వర్గం వారికే పెద్ద పీట వేశారన్న అపవాదును.. ఆయన మోయాల్సి వచ్చింది. కానీ, ఈసారి మంత్రివర్గ కూర్పుతో తానేంటో నిరూపించారు. అన్ని వర్గాలకు, మిత్రపక్షాలకు సమర్పిస్తూ కేబినెట్‌ను ఏర్పాటు చేశారు.
తిరుమల పర్యటనలోనూ కొత్త చంద్రబాబును చూపించారు. తాను వస్తున్నానని తెలిసి.. ఇరువైపుల కప్పిన పరదాలను తొలగించాలని అధికారులను స్వాధీనం చేసుకున్నాడు. ప్రజలకు, తనకు మధ్య ఇలాంటివి ఉండకుండా చూడాలని స్పష్టం చేశారు. అంతేకాదు.. స్కూల్ కిట్లలోనూ మార్క్ చూపించారు. ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలు పున: ప్రారంభం అయిన నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కిట్లు పంపిణీ చేయాల్సి ఉంది. ఆ కిట్లపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఫొటోలు ప్రచురించారు. అయితే, వాటిని పక్కనపెట్టేయాలా? అన్న సంస్థ అధికారులు ఉండగా, వారికి కీలక ఆదేశాలు ఇచ్చారు చంద్రబాబు. కిట్‌పై జగన్ ఫొటో ఉన్నా, వాటినే పంపిణీ చేయడం జరిగింది. ప్రభుత్వ ధనాన్ని వృథా చేయొద్దని స్పష్టం చేశారు. మొన్నటికి మొన్న.. పాఠశాలల్లో అందజేసే చిక్కీలపై గతంలో జగన్ ఫొటో ఉండగా, వాటి స్థానంలో చంద్రబాబు ఫొటో పెడతారని భావించారు. కానీ, ఏపీ ప్రభుత్వ చిహ్నాన్ని చేర్చి చంద్రబాబు తన సరికొత్త మార్కు పాలనకు శ్రీకారం చుట్టారు. ఇంతకుముందు చూసినవారు చంద్రబాబుకు, ఇప్పటి చంద్రబాబుకు చాలా తేడా కనిపిస్తోందని చర్చిస్తున్నారు.