హైదరాబాద్, ముద్రణ వార్తలు: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అసెంబ్లీలో అత్యంత ఘన విజయం సాధించి, ఉపముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేసిన కొణిదెల పవన్ కల్యాణ్ కు ఆయన వదినమ్మ, చిరంజీవి సతీమణి సురేఖ విలువైన బహుమతిని అందించారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం చిరంజీవి ఇంటికి పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు సురేఖ ఆయనకు అత్యంత ఖరీదైన మోంట్‌బ్లాంక్ పెన్ను బహుమతిగా ఇచ్చారు. సురేఖ స్వయంగా పెన్నును పవన్ కళ్యాణ్ జేబులో పెట్టగా, ఆయన ఎంతో సంతోషించారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ దగ్గర వున్న పెన్ను తీసి చూపించారు. ‘ఇది కూడా అట్టిపెట్టుకో’ అని సురేఖ అన్నారు. ఆ సందర్భంలో ఒక వైపు నుంచి చిరంజీవి, మరోవైపు పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా వచ్చారు. నలుగురూ కలసి ఒక మెమరబుల్ ఫొటో దిగారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ”తెలుగు ప్రజల ఆకాంక్షల్ని నిజం చేస్తావని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ వదిన, అన్నయ్య” అంటూ చిరంజీవి వీడియో ముగించారు. పవన్ కళ్యాణ్‌కి సురేఖ అందించిన మోంట్‌బ్లాంక్ పెన్ను ఖరీదు ఎంత ఉంటుందో తెలుసా… దాదాపు 2 లక్షల 75 వేల రూపాయలు.