ముద్ర ప్రతినిధి, నిర్మల్:ఇటీవలే నిర్మల్ టౌన్ పోలీస్ స్టేషన్ కు బదిలీపై వచ్చిన ఎస్సై కె చంద్రమోహన్ ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ -1 ఐజిపి ఎ వి రంగనాథ్ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. గత కొన్నేళ్లుగా సారంగాపూర్, నిర్మల్ రూరల్ పోలి స్టేషన్లలో ఈయన ఎస్సైగా పని చేశారు. సారంగాపూర్ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న సమయంలో పేకాటను ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. కాగా నిర్మల్ రూరల్ ఎస్సైగా ఉన్న సమయంలో ఈ ఏడాది ఫిబ్రవరి 2న ద్విచక్ర వాహనం, కారు ఢీ కొన్న ఘటనలో ఈయన అవకతవకలకు పాల్పడ్డారు. కారు బీమా గడువు ప్రమాదానికి ముందే ముగిసిన ప్రమాదం జరగక ఫిబ్రవరి 3 న రెన్యువల్ చేశారు. కాగా 2న ప్రమాదం జరిగితే బీమా చెల్లించిన అనంతరం ఫిబ్రవరి 6న జరిగిన ప్రమాదంలో కేసు నమోదు చేసి కారు యజమానికి లబ్ధి చేకూర్చిన ఆరోపణలతో ఈ చర్య తీసుకున్నారు.