Home » ఆంధ్రప్రదేశ్ మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే.. – Sravya News

ఆంధ్రప్రదేశ్ మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే.. – Sravya News

by Sravya Team
0 comment
ఆంధ్రప్రదేశ్ మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే..


అమరావతి, ఈవార్తలు: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు, మంత్రులుగా 24 మంది ప్రమాణం చేశారు. మంత్రివర్గంలో టీడీపీ నుంచి 20 మంది, జనసేన నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఒకరికి మంత్రి పదవి దక్కింది. సామాజిక వర్గం పరంగా చూస్తే.. బీసీలు – 8 మంది, ఎస్సీలు – ఇద్దరు, ఎస్టీ – ఒకరు, ముస్లిం మైనారిటీ – ఒకరు, వైశ్య – ఒకరు, కాపులు – నలుగురు, కమ్మ – నలుగురు, రెడ్డి – ముగ్గురు ఉన్నారు. మొత్తంగా మంత్రివర్గంలో ముగ్గురు మహిళలకు చోటు దక్కింది. కొత్త మంత్రివర్గంలో 17 మంది కొత్తవారే కావడం. మంత్రివర్గం కొలువుదీరడంతో మంత్రులకు శాఖలు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏ మంత్రికి ఏ శాఖ దక్కిందంటే..

మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే:

1. నారా చంద్రబాబు నాయుడు (టీడీపీ – కుప్పం) – ముఖ్యమంత్రి, సాధారణ పరిపాలన, శాంతిభద్రతలు, మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు

2. కొణిదెల పవన్ కల్యాణ్ (జనసేన – పిఠాపురం) – ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణ, నివాస, సైన్స్ టెక్నాలజీ శాఖలు

3. కింజరాపు అచ్చెన్నాయుడు (టీడీపీ – టెక్కలి) – వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు

4. కొల్లు రవీంద్ర (టీడీపీ – మచిలీపట్నం) – గనులు, ఆబ్కారీ శాఖలు

5. నాదెండ్ల మనోహర్ (టీడీపీ – తెనాలి) – పౌర సరఫరాల శాఖ, కన్జ్యూమర్ ఎఫైర్స్

6. పి.నారాయణ (టీడీపీ – నెల్లూరు సిటీ) – మున్సిపాలిటీ, పట్టణాభివృద్ధి శాఖ

7. వంగలపూడి అనిత (టీడీపీ – పాయకరావుపేట) – హోంశాఖ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్

8. సత్యకుమార్ యాదవ్ (బీజేపీ – ధర్మవరం) – ఆరోగ్యం

9. నిమ్మల రామానాయుడు (టీడీపీ – పాలకొల్లు) – జల వనరుల శాఖ

10. ఎన్.ఎమ్.డి.ఫరూక్ (టీడీపీ – నంద్యాల) – న్యాయ శాఖ

11. ఆనం రామనారాయణరెడ్డి (టీడీపీ – ఆత్మకూరు) -దేవాదాయ శాఖ

12. పయ్యావుల కేశవ్ (టీడీపీ – ఉరవకొండ) – ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖలు

13. అనగాని సత్యప్రసాద్ (టీడీపీ – రేపల్లె) – తాజా శాఖ

14. కొలుసు పార్థసారధి (టీడీపీ – నూజివీడు) – గృహ నిర్మాణ శాఖ, ఐఅండ్ పీఆర్

15. డోలా బాలవీరాంజనేయస్వామి (టీడీపీ – కొండేపి) – సాంఘిక సంక్షేమ శాఖ

16. గొట్టిపాటి రవి కుమార్ (టీడీపీ – అద్దంకి) – ఎనర్జీ శాఖ

17. కందుల దుర్గేష్ (జనసేన – నిడదవోలు) – టూరిజం, సినిమాటోగ్రఫీ శాఖలు

18. గుమ్మడి సంధ్యారాణి (టీడీపీ – సాలూరు) – మహిళా శిశు సంక్షేమ, ట్రైబల్ వెల్ఫేర్ శాఖలు

19. బీసీ జనార్థన్ రెడ్డి (టీడీపీ – బనగానపల్లె) – రోడ్లు, భవనాల శాఖ

20. టీజీ భరత్ (టీడీపీ – కర్నూలు) – ఇండస్ట్రీస్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖలు

21. ఎస్ సవిత (టీడీపీ – పెనుకొండ) – బీసీ వెల్ఫేర్, హ్యాండ్‌లూమ్స్, టెక్స్‌టైల్స్ శాఖలు

22. వాసంశెట్టి సుభాష్ (టీపీ – రామచంద్రాపురం) – లేబర్, ఫ్యాక్టరీసూస్, డిస్కషన్స్ అండ్ ఇన్రెన్స్ మెడికల్ సర్వీసెస్

23. కొండపల్లి శ్రీనివాస్ (టీడీపీ – గజపతినగరం) – ఎంఎస్‌ఎంఈ, సెర్ప్, ఎన్నారై ఎంపవర్ మెంట్ అండ్ రిలేషన్స్

24. మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి (టీడీపీ – రాయచోటి) – రవాణా, యూత్ స్పోర్ట్స్ శాఖలు

25. నారా లోకేశ్ (టీడీపీ – మంగళగిరి) – ఐటీ, హ్యూమన్ రిసోర్సెస్ శాఖలు

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in