Home » విశాఖలోని రుషి కొండ ప్యాలెస్ నిర్మాణాలను పరిశీలించి.. సంచలన విషయాలు బయటపెట్టిన గంటా శ్రీనివాసరావు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

విశాఖలోని రుషి కొండ ప్యాలెస్ నిర్మాణాలను పరిశీలించి.. సంచలన విషయాలు బయటపెట్టిన గంటా శ్రీనివాసరావు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by Sravya Team
0 comment
 విశాఖలోని రుషి కొండ ప్యాలెస్ నిర్మాణాలను పరిశీలించి.. సంచలన విషయాలు బయటపెట్టిన గంటా శ్రీనివాసరావు - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



రుషికొండ భవన రహస్యం వీడిందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఇన్నాళ్లు రహస్యంగా నిర్మించిన రుషికొండ భవనాలను పరిశీలించారు. ఇప్పటివరకు రుషికొండపై జరుగుతున్న నిర్మాణాల్లో ఏముందో ఎవరికీ తెలియదు. ఇప్పుడా రహస్యాన్ని గంటా శ్రీనివాసరావు బట్టబయలు చేశారు. రుషికొండ ప్యాలెస్ ను కళ్లు చెదిరే రీతిలో అత్యంత విలాసవంతంగా నిర్మించారని విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. ఆ భవనం లోపల ఏర్పాట్లు చూసి గంటా, మీడియా రిపోర్టర్లు ఆశ్చర్యపోయారు.

రుషికొండ ప్యాలెస్ ను పరిశీలించిన అనంతరం గంటా శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు. జగన్ నిబంధనలకు విరుద్ధంగా, రూ.500 భారీ వ్యయంతో అత్యంత రహస్యంగా ఈ ప్యాలెస్ నిర్మించారని. 61 ఎకరాల్లో ఈ భవన సముదాయాలు నిర్మించారని, అందులో రాజసౌధాన్ని తలపించేలా ఉన్న భవనం కోసమే రూ.500 కోట్లు ఖర్చు చేశారు. రుషికొండ మీద రూ.500 కోట్లతో జగన్ కట్టుకున్న జల్సా ప్యాలెస్‌లోని రూ.26 లక్షల బాత్ టబ్ ఉందని టీడీపీ ట్వీట్ చేసింది. రుషికొండ భవన రహస్యం వీడిందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఇన్నాళ్లు రహస్యంగా నిర్మించిన రుషికొండ భవనాలను పరిశీలించారు. గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, కూటమి నేతలు ఈ భవనాల సందర్శనకు వస్తే కేసులు పెట్టారు.

దీన్ని హోటల్ మాదిరిగానే వినిగించుకునే అవకాశం లేదని, పెద్ద కాన్ఫరెన్స్ హాలు కూడా ఉందని, ఇక్కడ సమీక్షలు చేపట్టేందుకు అనువుగా నిర్మించారని వివరించారు. ఇంత రహస్యంగా విలాసవంతమైన భవనం ఎందుకు కట్టారు? అని గంటా సూటిగా ప్రశ్నించారు.రుషికొండపై గతంలో టూరిజం కోసం హరిత రిసార్ట్స్ ఉండేవని, వీటి ద్వారా ఏటా రూ.8 కోట్ల ఆదాయం వచ్చేదని, ఈ రిసార్ట్స్ ను పడగొట్టి ప్యాలెస్ ను నిర్మించారని తెలిపారు. ఆఖరికి కోర్టులను కూడా తప్పుదోవ పట్టించి ఈ విలాస భవనం నిర్మించారని. మొదట స్టార్ హోటల్ అన్నారని, ఆ తర్వాత సీఎం క్యాంపు కార్యాలయం అన్నారని, అనంతరం టూరిజం ప్రాజెక్టు అని చెప్పారని.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in