టైటిల్ యాక్ట్ ను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రిటైర్డ్ ఐల్యాండ్ అధికారి పివి రమేష్ ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. గతంలోనే వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నట్లు పివి రమేష్ ఎన్నికల ముందు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇది అప్పట్లోనే సంచలనం అయింది. తాజాగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్.. తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. గతంలో తన పట్టా భూమి మ్యూటేషన్ కు అధికారులు నిరాకరించారని ఈ సందర్భంగా ఆయన తండ్రి పేర్కొన్నారు. ఆర్డీవోకు పోస్టులో పంపిన పత్రాలను తిరిగి వెనక్కి పంపించారని చెప్పారు. చట్టం రాకముందే భూములపై హక్కులు నిరాకరించారని పీవీ రమేష్.. అవగాహనతోనే గత ప్రభుత్వం ఈ చట్టం తెచ్చిందని. తాజాగా చంద్రబాబు ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకురాకూడదంటూ తీసుకున్న నిర్ణయం పట్ల పివి రమేష్ హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం రైతులకు, భూ యజమానులకు ఎంతో మేలు చేస్తుందంటూ ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇది ఎలా ఉంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల వైసిపి ఆచితూచి వ్యవహరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకురావాలని భావించిన ఈ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలా రద్దు చేస్తుందో వేచి చూడమంటూ రెండు రోజుల కిందట ఎంపీలు సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.
ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై పీవీ రమేష్ కీలక వ్యాఖ్యలు – Sravya News
26