అమరావతి, ఈవార్తలు : అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న వైసీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు పార్టీ నేతలు పార్టీ మారుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు నిజంగానే పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు తన రాజీనామా లేఖను పంపించారు. వ్యతిగత కారణాలతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని. వాస్తవానికి శిద్ధా రాఘవరావు తనకు దర్శి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. అయితే, ఆ ప్రతిపాదనను జగన్ తిరస్కరించారు. ఉమ్మడి ప్రకాశంలోని అద్దంకి, ఒంగోలు, మార్కాపురంలో ఏదైనా ఒక సీటును ఎంచుకోవాలని సూచించారు. దానికి శిద్ధా రాఘవరావు తిరస్కరణ వ్యక్తం చేశారు. చివరికి ఎన్నికలు అయ్యే వరకు మౌనంగానే ఉన్నారు. ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్టు సన్నిహితులకు చెప్తూ వచ్చారు. తాజాగా, ఏపీలో వైసీపీ అధికారం కోల్పోవడంతో రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
వైసీపీకి షాక్.. పార్టీకి మాజీ మంత్రి రాజీనామా – Sravya News
29