ముద్ర,ఆంధ్రప్రదేశ్:-సచివాలయంలో జలవనరుల శాఖ మంత్రిగా నిమ్మల రామానాయుడు ఇవాళ బాధ్యతలు చేపట్టారు. గతంలో పోలవరం నిర్మాణ పనులను పరుగులు పెట్టించామని అన్నారు. వైసీపీ పాలనలో పోలవరం నిర్మాణాన్ని అసలు పట్టించుకోలేదని.మరింత లోతుగా సమీక్షించి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగవంతం చేస్తామన్నారు. తప్పు చేసిన ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని తెలియజేసారు. పోలవరానికి కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకొస్తామని తెలిపారు. తప్పు చేస్తే ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న తాము పోలవరం కోసం మరిన్ని నిధులు తీసుకొస్తామని చెప్పారు. వ్యవసాయం, రైతుల విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, కాలువల్లో నీరు పారకుండా గుర్తింపు పొందిందని. కాలువల్లో పేరుకుపోయిన గుర్రపుడెక్క తొలగింపు, పూడికతీతపై తొలి సంతకం చేసినట్టు వివరించారు.