విజయవాడ, ఈవార్తలు : విశాఖలోని రుషికొండ భవనాలే ఇప్పుడు హాట్ టాపిక్. వైసీపీ హయాంలో సీఎం నివాసం కోసం నిర్మించినట్లు చెప్తున్న ఈ భవనాల్లో అత్యాధునిక వసతులపై అంతా మక్కున వేలేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో హల్ చల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పాలనలో పర్యాటక శాఖ మంత్రిగా పనిచేసిన రోజా సెల్వమణి వైసీపీ భవనాలపై వస్తున్న విమర్శలపై స్పందించారు. రుషికొండలో నిర్మించిన టూరిజం బిల్డింగ్ ఒక్కటే టీడీపీ వాళ్లకు కనిపిస్తోందని. రాష్ట్రంలో నిర్మించిన మెడికల్ కాలేజీలు, రాష్ట్రంలో నిర్మించిన పోర్టులు, రాష్ట్రంలో నిర్మించిన సచివాలయాలు, రాష్ట్రంలో నిర్మించిన ప్రభుత్వ పాఠశాలలు కూడా వెళ్లి చూడాలని చురక అంటించారు. పచ్చకామెర్లు వచ్చినవాళ్లకు లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని.. స్కాంలు చేయటం ఉన్న చంద్రబాబుకు కూడా అన్నీ స్కాంలలాగే కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. రుషికొండ భవనాలపై టీడీపీ నేతలవి ఏడుపులేనని. ఆ పర్యాటక భవనంలో ప్రపంచస్థాయి నేతలు వస్తారని, వారికోసం ఆ స్థాయిలో ఫర్నిచర్ ఏర్పాటు చేయడం అవసరమని చెప్పారు.
నేతల నేతల విజయం ఏమిటనేది అర్థం అవుతోందని చిన్న పిల్లలకు కూడా అర్థం అవుతోందని, పరోక్షంగా ఈవీఎంలను ఉద్దేశించి టీడీపీ ప్రతిపాదన. గుమ్మడి కాయ దొంగ అంటే టీడీపీ నేతలు భుజాలు తడుముకుంటున్నారని. 40 శాతం ఓట్లతో రేవంత్ సీఎం అయ్యారని, 40 శాతం ఓట్లు వచ్చిన మోదీ ప్రధాని అయ్యారని, అదే..40 శాతం ఓట్లు వచ్చిన జగన్కు 11 సీట్లపై అనుమానం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో ప్రజలను జగన్ సొంత కుటుంబం చూసుకున్నారని. ఏపీ ప్రజలకు 40 శాతం ఓట్ షేర్ అందించారని, మళ్లీ భవిష్యత్తు పార్టీ వైసీపీ కార్యాచరణతో ప్రజల్లోకి వస్తామని చెప్పారు.