ముద్ర,సెంట్రల్ డెస్క్:- కృష్ణాజిల్లా పెదపారుపూడి గ్రామంలో 1936 నవంబరు 16వతేదీన చెరుకూరి వెంకటసుబ్బారావు, సుబ్బమ్మ దంపతులకు జన్మించిన రామోజీరావు రైతుబిడ్డ నుంచి పారిశ్రామికవేత్తగా ఎదిగారు.ఢిల్లీలో కొన్నాళ్లు పనిచేసిన రామోజీ తిరిగి హైదరాబాద్‌కు వచ్చి మార్గదర్శి పేరుతో ఛిట్ ఫండ్ కంపెనీని కలిగి ఉంది.నాడు పత్రికలన్నీ విజయవాడ, హైదరాబాద్ నగరాల నుంచి వెలువడే రోజుల్లో 1974వ సంవత్సరం ఆగస్టు 10వతేదీన విశాఖ ఈనాడు సాగర తీరంలో ఈనాడు దినపత్రికను ప్రారంభించి సర్కులేషన్‌లో అగ్రగామిగా నిలిపారు.
ఆర్టిస్టుగా ఉద్యోగం నుంచి…
ఢిల్లీలో రామోజీరావు అడ్వర్టటైజింగ్ ఏజెన్సీలో ఆర్టిస్టుగా ఉద్యోగం కోసం.మూడేళ్ల పాటు ఢిల్లీలో ఉద్యోగం చేసిన రామోజీరావు 1962లో తిరిగి హైదరాబాద్‌కు వచ్చారు. 1962లో మార్గదర్శి ఛిట్ ఫండ్ కంపెనీని కలిగి ఉంది. రామోజీరావు తొలి కిరణ్ ఛీట్ కావడం విశేషం.1965వ సంవత్సరంలో యాడ్స్ వాణిజ్య ప్రకటనల సంస్థ.1967-69 ప్రాంతంలో ఖమ్మంలో వసుంధర పేరుతో ఫెర్టిలైజర్స్ పేరుతో పేరు పెట్టబడిన వ్యాపారం. 1969వ సంవత్సరంలో మొదటిసారి వ్యవసాయ సమాచారంతో అన్నదాత పత్రికను ప్రారంభించి విజయవంతంగా నడిపారు.1970లో ఇమేజెస్ పేరుతో అవుట్ డోర్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ నెలకొల్పారు. ఇమేజెస్లను బాధ్యత తన భార్య రమాదేవికి అప్పగించారు.
మీడియా టైకూన్ గా రామోజీరావు…
తెలుగు జర్నలిజాన్ని కొత్త పుంతలు తొక్కించి మీడియా టైకూన్‌గా రామోజీరావు నిలిచారు. జిల్లా పత్రికలను ప్రవేశ పెట్టి స్థానిక వార్తలను పాఠకులకు అందించిన ఘనత రామోజీరావుకే దక్కింది. రంగుల్లో పత్రికను ముద్రించడంలో మిగిలిన పత్రికలకు దిక్కుగా నిలిచారు. ప్రతీ నిత్యం ఈనాడు అన్ని ఎడిషన్లు, జిల్లా పత్రికలను చదివి, వార్తల పై వ్యాఖ్యలు రాస్తూ ఈనాడును అగ్రస్థానానికి తీసుకువచ్చారు. ప్రతీ మూడుకు ఓ సారి ఈనాడు ఉప సంపాదకులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి జర్నలిజంలో వారికి మార్గనిర్దేశం చేశారు.
పనిలోనే విశ్రాంతి….
నిత్యం పనిలోనే విశ్రాంతి అంటూ రోజుకు 18 గంటలు శ్రమించిన రామోజీరావు తన వ్యాపారసంస్థలను ప్రగతి పథంలోకి తీసుకువెళ్లారు. 20 ఏళ్ల భవిష్యత్ ను ముందే ఊహించి దానికి అనుగుణంగా తన వ్యాపార సంస్థలను ముందుకు తీసుకువెళ్లిన ధీరుడిగా రామోజీ నిలిచారు. కఠోర సాధనతోనే వ్యాపారరంగంలో విజయాలు సాధించారు.
రామోజీ ఫిలింసిటీకి ప్రపంచ వ్యాప్త గుర్తింపు…
తెలంగాణలోని హైదరాబాద్ నగర శివారులలో వేలాది ఎకరాల్లో సినిమా షూటింగుల కోసం నిర్మించిన రామోజీ ఫిలింసిటీకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. గిన్నిస్ బుక్ రికార్డు ఫిలింసిటీకి దక్కింది. తన సంస్థల్లో పనిచేసిన ఉద్యోగులకు కష్టపడి పనిచేయడం నేర్పించిన ధీశాలి. ఈనాడు, ఈటీవీతోపాటు పలు వ్యాపార సంస్థలను నెలకొల్పిన రామోజీరావు తెలుగు రాష్ట్రాల్లో పారిశ్రామికవేత్తగా, మీడియా మొఘల్ గా పేరొందారు.
పద్మవిభూషణ్ అవార్డు..
రామోజీరావును పలు అవార్డులు వరించాయి. జర్నలిజం, సాహిత్యం, విద్యారంగాల్లో ఆయన చేసిన సేవకు గుర్తింపుగా 2016వ సంవత్సరంలో రామోజీకి కేంద్రప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డును ప్రదానం చేసింది. ఉషా కిరణ్ మూవీస్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించి పలు సందేశాత్మక చిత్రాలు తీశారు. సుధాచంద్రన్ నిజజీవిత గాథను మయూరి పేరుతో తీసిన సినిమాకు 1986వ సంవత్సరంలో బెస్ట్ ఫీచర్ ఫిలింగా నంది అవార్డు లభించింది.
ఎన్నెన్నో నంది అవార్డులు…
1992లో అశ్వనీ సినిమాకు కూడా నంది అవార్డు దక్కింది. 1999 వ సంవత్సరంలో రామోజీరావుకు ఫిలింఫేర్ సౌత్ స్పెషల్ అవార్డు లభించింది. 2001లో తీసిన నువ్వే కావాలి సినిమాకు బెస్ట్ ఫీచర్ ఫిలింగా జాతీయ అవార్డు వచ్చింది. 2001,1986 సంవత్సరాల్లో ఈయన తీసిన నువ్వే కావాలి, ప్రతిఘటన చిత్రాలు బెస్ట్ ఫిలింలుగా ఫిలింఫేర్ అవార్డులు ఇచ్చారు. 2000, 1985 సంవత్సరాల్లో తీసిన ‘నీ కోసం’, కాంచనగంగా సినిమాలకు నంది అవార్డులు, 2005లో ఫిలింఫేర్ లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డు లభించింది.