51
జగన్ హయాంలో గత ఐదేళ్లలో ఇసుక విధానం ముసుగులో ఏకంగా రూ.2,566 కోట్ల కుంభకోణం జరిగింది. నాటి వైసీపీ పెద్దల దోపిడీకి గనుల శాఖ పూర్వ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి అన్నీ తానై సహకరించారు. ఇసుక కాంట్రాక్టు సంస్థలైన జేపీవీఎల్, జీసీకేసీ, ప్రతిమ సంస్థలు, మరికొందరు వ్యక్తులతో కలిసి రూ.వేల కోట్లు కొల్లగొట్టేందుకు సిద్ధమయ్యారు. టెండర్లు, ఒప్పందాలు, ఏపీఎంఎంసీ నిబంధనలు, ఆపరేషన్స్, ఇసుక తవ్వకాల్లో పెద్ద ఎత్తున ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఏసీబీ కీలక ఆధారాలను బయటపెట్టింది.